యాదాద్రి, జూలై15 : యువత స్వశక్తితో తమ కాళ్లపై తాము నిలబడాలని, అందుకోసం అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం ఉచితంగా స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వడంతోపాటు రుణాలు అందజేసి భరోసా కల్పిస్తున్నదని తెలిపారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న 479 మంది యువతీయువకులకుశుక్రవారం ఆమె సర్టిఫికెట్లను అందజేశారు. రానున్న రోజుల్లో మరిన్ని అంశాలపై శిక్షణ అందిస్తామని, గ్రామీణ ప్రాంత యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
యాదాద్రి, జూలై 15 : నిరుద్యోగ యువతకు ప్రభుత్వం వృత్తి నైపుణ్యం శిక్షణ ఇవ్వడంతో పాటు రుణాలు అందించి భరోసా కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న 479మంది యువతకు శుక్రవారం ఆమె సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణ కేంద్రంలో ఐదు విభాగాలైన ఎంస్ ఆఫీస్, బ్యూటీషియన్, టైలరింగ్, డొమెస్టిక్ ఎలక్ట్రికల్, మొబైల్ రిపేర్లలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శ్రీరామానంద తీర్థ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో మహిళలకు జర్దోసిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని విభాగాల్లో శిక్షణ ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, యువజన, క్రీడలశాఖ జిల్లా అధికారి కె.ధనుంజనేయులు, మున్సిపల్ వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజు, కౌన్సిలర్లు బూడిద సురేందర్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ బాబు, సిబ్బంది సైదులు, మురళి, ఫ్యాకల్టీ రాజశేఖర్, రేణుక, కైసర్, నవీన్ పాల్గొన్నారు.
ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిశీలన
ఆలేరు : ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రి పైభవనం పెచ్చులు ఊడిపడడం విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వ విప్ సునీతామహేందర్‌రెడ్డి హుటాహుటిన సందర్శించారు. ఆస్పత్రి మొత్తం పరిశీలించి భవన స్లాబ్ మరమ్మతులు చేయాని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పుట్ట మల్లేశ్, రాయపురం నర్సింహులు, టీఆర్ఎస్ మాజీ పట్టణాధ్యక్షుడు మొరిగాడి వెంకటేశ్, సర్పంచులు పాల్గొన్నారు.