రామగిరి, జూన్ 7 : ఈ నెల 12న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టెట్ నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్ష నిర్వహణలో పొరపాట్లు జరుగకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నది. రెవెన్యూ, పంచాయతీరాజ్‌తోపాటు ఇతరశాఖ అధికారులు, సిబ్బందికి ఇన్విజిలేషన్ విధులు అప్పగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు అందజేసింది. వీరికి ఈ నెల 8న వేర్వేరుగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. కలెక్టర్ ఆదేశాలతో పరీక్షను పటిష్టంగా నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు.
నిమిషం లేటైతే..
టెట్ పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. పేపర్ -1 ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్నది. నిర్ణీత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని సూచిస్తున్నారు.
353 పరీక్ష కేంద్రాలు
టెట్ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 353 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, నాగార్జునసాగర్(నందికొండ), దేవరకొండ, చండూర్, నకిరేకల్, చిట్యాలలో కేంద్రాలు కేటాయించారు. పేపర్-1కు 96 పరీక్ష కేంద్రాలు, పేపర్-2కు 87 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పరీక్ష విధుల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది…
అభ్యర్థులు పాటించాల్సిన నియమాలు
హెల్ప్‌లైన్ సెంటర్లు
నల్లగొండ జిల్లాలో టెట్‌కు సంబంధించి ఏదైనా సమాచారం, సమస్యలుంటే డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్స్ ఫోన్ నంబర్లు 9849909123, 9121212513ను సంపద్రించవచ్చు. దాంతోపాటు ఎంఈఓలు నల్లగొండ 7993354867, మిర్యాలగూడ 9642116010 , దేవరకొండ 9603344171, హాలియా 9491594771, చండూర్ 7993354870, చిట్యాల 7993354857, నకిరేకల్ 7993354868, పెద్దవూర 9491594771 నంబర్లను సంప్రదించాలని విద్యాశాఖాధికారులు
వెల్లడించారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
రాష్ట్ర విద్యాశాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టీఎస్ టెట్-2022 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నాం. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. పరీక్ష విధులు నిర్వహించే వారికి ఈ నెల 8న శిక్షణ ఇస్తున్నాం. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పరీక్ష పకడ్బందీగా నిర్వహించేలా పనిచేస్తున్నాం.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ.