నల్లగొండ సిటీ, జనవరి 31 : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 42వ డివిజన్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కుంచెం ఎల్లయ్య, పల్లపు దశరథ, గోగుల చిన్న మల్లయ్య, శంకర్ తో పాటు పలువురు బీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసిన ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రతి ఓటరు బీఆర్ఎస్ పై సానుకూలంగా ఉన్నారని చెప్పారు. అన్ని డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోగాకు నాగరాజు, గోగుల పెద్ద మల్లయ్య, కత్తుల జానయ్య, సముద్రాల వెంకన్న, వడ్డెర వెంకన్న, జానయ్య పాల్గొన్నారు.