ఈ దసరాకు అక్కినేని నాగార్జున (Nagarjuna), మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన చిత్రాలు విడుదలైన విషయం తెలిసిందే. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ ది ఘోస్ట్, పొలిటికల్ థ్రిల్లర్‌గా మోహన్ రాజా డైరెక్ట్ చేసిన గాడ్ ఫాదర్ చిత్రాలు భారీ అంచనాల మధ్య విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు తొలి రోజు పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అయ్యాయి.
నైజాం ఏరియాలో ఈ రెండు సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. నైజాంలో ది ఘోస్ట్ తొలి రోజు రూ.50 లక్షల (జీఎస్ట్ లేకుండా) షేర్ రాబట్టగా..గాడ్ ఫాదర్ మాత్రం రూ.3 కోట్లు (జీఎస్టీతో కలిపి) వసూళ్లు చేసినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. ఈ రెండు చిత్రాలకు వీకెండ్ చాలా కీలకమని తాజా ఫిగర్స్ తో అర్థమవుతుంది. గాడ్ ఫాదర్ తెలుగు రాష్ట్రాల్లో రూ.13 కోట్లు వసూళ్లు చేయగా..వరల్డ్‌వైడ్‌గా రూ.17.5 కోట్లు రాబట్టినట్టు ఇన్సైడ్ టాక్.
మరోవైపు గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద ది ఘోస్ట్‌కు గట్టి పోటీనే ఇవ్వనుందని తెలిసిపోతుంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి వసూళ్లు వస్తాయనేది చూడాలంటున్నారు సినీ జనాలు. గాడ్ ఫాదర్ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించాయి. ఎస్ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఎస్ థమన్ మ్యూజిక్ అందించాడు.
ది ఘోస్ట్ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరక్కించారు.
Read Also : Ahimsa Teaser | తేజ టీం క్రేజీ అప్డేట్..లవ్ ట్రాక్, యాక్షన్ పార్టుతో అహింస టీజర్
Read Also :Salman Khan | మై డియర్ చిరు..సల్మాన్ ఖాన్ వీడియో వైరల్
Read Also : Satyadev | గాడ్ ఫాదర్‌తో సత్యదేవ్..ఎమోషనల్ పోస్ట్ వైరల్