Tirumala | కలియుగదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని (Lord Venkateswara Swamy) టాలీవుడ్ స్టార్ జంట దర్శించుకుంది. గురువారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), శోభిత (Sobhita Dhulipala) దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి వచ్చిన ఈ జంటకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. నాగచైతన్య – శోభిత జంట స్వామివారిని దర్శించుకుని ఆలయం బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#NagaChaitanya garu & #Sobhita garu seek the blessings of Lord Venkateswara Swamy at Tirumala 🙏 pic.twitter.com/eWnZY39QCU
— Subbu (@SubbarajuSiva) August 21, 2025
Also Read..
Samantha | ఆ రెండింటికీ సమ ప్రాధాన్యం.. అందుకే సినిమాలు తగ్గించా : సమంత
Vishwambhara | విశ్వంభర రిలీజ్ డేట్ చెప్పిన చిరు.. జాప్యానికి కారణం ఇదేనంటూ మెగాస్టార్ క్లారిటీ