Farmer | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పంట పొలాలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలకుర్తికి సరిపడా నీళ్లొచ్చేవని.. కేసీఆర్ ప్రభుత్వంలో పెట్టుబడికి డబ్బులు ఇచ్చేది.. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి అప్పుల పాలయ్యామని ఇప్పటికే పాలకుర్తికి చెందిన బాధిత మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది.
పాలకుర్తికి చెందిన మరో మహిళా రైతు తన మూడెకరాల పొలం ఎండిపోయిందంటూ కన్నీరుమున్నీరైంది. నాకు నలుగురు కొడుకులు.. మూడెకరాల పొలం మొత్తం ఎండిపోయింది. రెండేళ్ల నుంచి రైతు బంధు కూడా వేయడం లేదు. ఒక్క రూపాయి కూడా ఇస్తలేడు. నా పిల్లలను ఏం చేసి పెంచాలె. కేసీఆర్ ఉన్నపుడు మంచిగా నీళ్లుండే.. ఇప్పుడు కాలువ కూడా విడిచిపెట్టడం లేదు. ఏం చేయాలో అర్థం కావలేదు. మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కనీసం ఇటు పక్కకు కూడా రావడం లేదు.. వచ్చి చూడటం లేదు.
ఓట్లప్పుడు అందరు వస్తరు.. రెండు సంవత్సరాల నుంచి రైతు బంధు లేదు. ఏం లేదు.. అరిచి అరిచి నా గొంతు కూడా పోయింది. నీళ్లు లేక మా పొలం మొత్తం ఎండిపోయింది.. ఏం చేయాలే. మా ఆయన కాలువ మలుపుదామని 20 రోజుల నుంచి పోతుండు.. కానీ ఇటు నీళ్లు వస్తలేవంటూ వాపోయింది.
నీళ్లు లేక పొలం మొత్తం ఎండిపోయిందంటూ కంటతడి పెట్టిన పాలకుర్తి మహిళా రైతు
రెండు సంవత్సరాల నుండి రైతు బంధు కూడా వెయ్యడం లేదు
కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నీళ్లు ఉండే.. ఇప్పుడు కాలువ కూడా ఇడిచిపెట్టడం లేదు
మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కనీసం ఇటు పక్క కూడా రావడం లేదు https://t.co/lo1d8DqsBR pic.twitter.com/IbKYkLNTnt
— Telugu Scribe (@TeluguScribe) March 12, 2026
Odisha | మద్యం మత్తులో దారుణం.. కుటుంబ కలహాలతో భార్య, కోడలు, మనవరాలి హత్య
Jasveer Singh | ముందుగా రూ.28 లక్షలకు ఒకే చెప్పిన టెకీ.. ఆపై రూ.36 లక్షలిస్తేనే చేరుతానని మెలిక..!