e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News Huzurabad | గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలి : ఎమ్మెల్సీ సురభి వాణీదేవి

Huzurabad | గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలి : ఎమ్మెల్సీ సురభి వాణీదేవి

ఇల్లందకుంట : టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాప్ యాద‌వ్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. గురువారం మండలంలోని సిరిసేడు గ్రామంలో అపర్ణ సోమేశ్వర దేవాలయం, ఇల్లందకుంట లోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో వాణీదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇల్లందకుంట టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ పీవీ నర్సింహారావును ఏ ప్రభుత్వం గుర్తించలేదని, తెలంగాణ ప్రభుత్వం మా కుటుంబాన్ని గుర్తించి సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి గెలిపించారన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం కలుపు మొక్కలను ఏరివేయాలని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు.

- Advertisement -

ప్రజలందరూ ఐక్యంగా ఉండి గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. ప్రాజెక్టులు కట్టి బీడు పడిన భూములకు సాగునీరు అందించడంతో కనుచూపు మేర ప‌చ్చ‌ని వరి పొలా లు కనబడుతున్నాయని చెప్పారు. ఇతర పార్టీలు పెట్టే ప్రలోభాలకు ప్రజలు గురి కావద్దని సూచించారు.


టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు పలు అభివృద్ధి పనులు చేస్తుందన్నారు. రైతులు పండిం చిన పంటలకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతులకు ప్రాజెక్టుల ద్వారా నిరంతరం సాగునీరు అందిస్తు న్నట్లు పేర్కొన్నారు.

గెల్లు శ్రీనివాస్ కోసం మూడు నెలలుగా కష్టపడి పని చేస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరో పది రోజులు ముందుండి పని చేయాలని కోరారు. రైతులకు రైతు వేదికలు, రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలను సీఎం కేసీఆర్‌ అమలు చేశారన్నారు.

ఈ సమావేశంలో సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, వేలేరు జడ్పీటీసీ చాడ సరిత, లింగాలఘణపూర్‌ ఎంపీపీ జయశ్రీదేవి, మహిళా మండలాధ్యక్షురాలు స్వరూపరాణి, వరంగల్‌ ఉమ్మడి జిల్లా డీసీసీ చైర్మన్‌ గుండేటి రాజేశ్వర్‌రెడ్డి, ఇల్లందకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్‌ కందాల కొమురెల్లి, ఎంపీటీసీలు సంజీవరెడ్డి, ఐలయ్య, ఇల్లందకుంట ఇన్‌చార్జి దేవేందర్‌, నాయకులు సరిగొమ్ముల వెంకటేష్‌ తదితరులున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement