Musi River | భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 27 : హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పరిధిలోని జూలూరు – రుద్రవెల్లిలో లెవెల్ బ్రిడ్జి పైనుంచి మూసీ వరద పరవళ్ళు తొక్కుతుంది. దీంతో వాహన రాక పోకలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన పోలీసులు రహదారికి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. బీబీనగర్ భువనగిరి జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు పెద్ద రావులపల్లి నుండి ప్రయాణికులు, వాహనదారులు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.