Sai Pallavi | సినిమాల్లో గ్లామర్‌కు భిన్నంగా నేచురల్ నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే నటీమణుల్లో సాయిపల్లవి ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎక్స్పోజింగ్ లేకుండానే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఆమెకు ‘లేడీ పవర్ స్టార్’ అనే బిరుదు ఉంది. అందం, అభినయం, ఆచరణ ఈ మూడింటి కలయికతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఇటీవల సోషల్ మీడియాలో ఆమె బికినీ ఫోటోలు వైరల్ కావడం పెద్ద చర్చకు దారి తీసింది. చెల్లెలితో కలిసి బీచ్‌కి వెళ్లిన సమయంలో తీసుకున్న ఫోటోలు అంటూ కొన్ని బికినీ దుస్తుల్లో ఉన్న చిత్రాలు వైరల్ అయ్యాయి. వాటిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం అది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ అని కామెంట్ చేశారు. అయితే అవి నిజమైనవా? లేకుంటే ఏఐ జనరేటెడా ? అనే చర్చల మధ్య సాయిపల్లవి మౌనంగా ఉండటం టాపిక్ హీటెక్కేలా చేసింది.
తాజాగా, ఈ వివాదానికి చెక్ పెడుతూ సాయిపల్లవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. ‘‘పైన కనిపిస్తున్న ఫోటోలు నిజమైనవే.. ఏఐతో చేసినవి కావు’’ అంటూ ఆమె క్యాప్షన్ ఇచ్చింది. దీంతో సాయి పల్లవి బికినీ ఫోటోలు అంతా ఫేక్ అని, తాను షేర్ చేసినవి కాదన్న స్పష్టతను ఇండైరెక్ట్‌గా ఇచ్చినట్లయ్యింది. ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి భారీగా స్పందన వచ్చింది. ‘‘నువ్వు బికినీ వేసుకున్నావంటే మేం నమ్మలేం’’, ‘‘ఒక్క పోస్టుతో విమర్శకులకు సమాధానం చెప్పావ్’’, ‘‘నిన్ను చూసి గర్వపడతాం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సాయిపల్లవి, రణ్‌బీర్ కపూర్ సరసన హిందీలో రూపొందుతున్న భారీ చిత్రం ‘రామాయణ’లో సీత పాత్రలో నటిస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్లో ఆమె వరుస ఆఫర్స్ అందుకోవడం ఖాయం. మలయాళీ అయిన సాయి పల్లవి తన నేచురల్ నటనతో ఎంతగానో మెప్పిస్తుంది. తను వచ్చిన ఆఫర్స్ అన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు. పాత్ర బాగుంటేనే సాయి పల్లవి ఆ సినిమాలో నటించేందుకు ఓకే చెబుతుంది. తెలుగులో ఎన్నో మంచి చిత్రాలతో మెప్పించిన సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లోను పాగా వేయాలని అనుకుంటుంది. మరి రణ్‌బీర్ కపూర్‌తో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది, ఇది సాయి పల్లవికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది చూడాలి.