Murder Attempt | కథలాపూర్, ఆగస్టు 6: కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామానికి చెందిన మోత్కూరీ పెద్ద భూమయ్యపై అదే గ్రామానికి చెందిన ముస్కెం రాజం హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు బుధవారం పేర్కొన్నారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇక ఇప్పపెల్లి గ్రామ శివారులో పలువురు రైతుల వ్యవసాయ భూముల రోడ్డును రాజం కబ్జా చేసిన విషయంలో వివాదం జరుగుతుంది.
బుధవారం ఉదయం మోత్కూరు పెద్ద భూమయ్య పని నిమిత్తం గ్రామ శివారులోకి వెళుతుండగా.. ముస్కెం రాజం కర్రతో పెద్ద భూమయ్య తలపై, వీపు భాగంలో దాడి చేశాడు. దీంతో పెద్ద భూమయ్య తీవ్రగాయాల పాలై అక్కడ పడిపోయారు. గ్రామస్తులు వెంటనే పెద్ద భూమయ్యను చికిత్స నిమిత్తం కోరుట్ల పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు.
ఈ సంఘటన స్థలాన్ని కోరుట్ల ఎస్ఐ చిరంజీవి పరిశీలించారు. ముస్కెం రాజంపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Motkur : తెలంగాణ ఉద్యమ వైతాళికుడు జయశంకర్ సార్ : దూళిపాల ధనుంజయ నాయుడు
Raj B Shetty | పెద్ద స్టార్లతో నటిస్తే ఇబ్బందులు పడాలి.. రాజ్ బీ శెట్టి కామెంట్స్ వైరల్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలి : ఓరుగంటి రమణారావు