న్యూఢిల్లీ, అక్టోబర్ 12: బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం భారతదేశానికి ఉన్న ప్రత్యేకతలలో నకిలీ వార్తలు ఒకటి అని విమర్శించారు. ఈ మేరకు అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలు చేశారు. నిరుడు బంగ్లాదేశ్ ప్రజల తిరుగుబాటుతో ఆ దేశ ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగారు.
ఆ సమయంలో అక్కడ చెలరేగిన అల్లర్లలో హిందువులపై దాడులు జరిగాయంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఈ అంశంపై అమెరికా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు యూనస్ సమాధానమిస్తూ అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేశారు. కొన్నిచోట్ల ఇరుగు పొరుగు మధ్య భూమి వివాదాలు జరిగితే వాటికి కొందరు మత ఘర్షణలుగా ప్రచారం చేశారని మండిపడ్డారు.