రామ్ పోతినేని నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఉపేంద్ర ఇందులో ఆన్‌స్క్రీన్ సూపర్‌స్టార్‌గా కనిపించబోతున్నారు. మహేశ్‌బాబు.పి దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 28న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఆదివారం ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. తన అభిమాన స్టార్హీరో విజయాలను సెలబ్రేట్ చేస్తే అభిమానిగా ఇందులో రామ్ నటిస్తున్నట్టు టీజర్ చెబుతున్నది.
అభిమాన హీరోను తనెంత ప్రేమిస్తాడో, అంతే తీవ్రంగా అతన్ని ప్రేమించే అమ్మాయిగా భాగ్యశ్రీ బోర్సే కనిపించింది. మురళీశర్మ చెప్పిన మనసుని తాకే మాటలతో టీజర్ ముగిసింది. రావురమేశ్, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ నుని, సంగీతం: వివేక్ అండ్ మెర్విన్, సమర్పణ: గుల్షన్‌కుమార్, భూషణ్‌కుమార్, అండ్ టి.సిరీస్ ఫిల్మ్స్