వాషింగ్టన్: అమెరికాలోని సౌత్ కరోలినా, సెయింట్ హెలెనా దీవిలో ఆదివారం ఉదయం దారుణం జరిగింది. రద్దీగా ఉన్న బార్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా, 20 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
వీరందరికీ దవాఖానల్లో చికిత్స చేయిస్తున్నారు. తూటాల నుంచి తప్పించుకోవడం కోసం పదుల సంఖ్యలో ప్రజలు సమీపంలోని ఇళ్లు, దుకాణాల్లోకి పరుగులు తీశారు. బ్యూఫోర్ట్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఓ ప్రకటనలో ఈ వివరాలను తెలిపింది.