Helicopter crash : అగ్రరాజ్యం అమెరికా (USA) లోని దక్షిణ కాలిఫోర్నియా (South California) లోగల బీచ్ సమీపంలో ఓ హెలికాప్టర్ (Helicopter) కుప్పకూలింది. గాల్లో సుడులు తిరుగుతూ ఓ ఇంటి ఆవరణలో ఉన్న చెట్లపై పడిపోయింది. అప్పటిదాకా సజావుగా వెళ్తున్న హెలికాప్టర్.. ఒక్కసారిగా అదుపుతప్పి కూలిపోయింది.
ఓ భవనం ఆవరణలో చెట్లపై హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో మొత్తం ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు హెలికాప్టర్లో ఉన్నవాళ్లు కాగా, మరో ముగ్గురు కింద ఉన్నవాళ్లు. క్షతగాత్రులు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్గా మారాయి.
Breaking helicopter crash in California rotor came off no explosion hopefully they are ok. pic.twitter.com/7zFMJnMxcW
— 0HOUR (@0HOUR1__) October 11, 2025