కుభీర్ : ముధోల్ నియోజకవర్గంలోని కుభీర్, కుంటాల, బాసరకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గ బీఆర్ఎస్(BRS) సమన్వయ సమితి సభ్యుడు కిరణ్ కొమ్రేవార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను (KTR) కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో హైదరాబాదులో కేటీఆర్ సమావేశమై నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులు, స్థానిక ఎన్నికల్లో పార్టీల బలాబలాలు, ప్రజల్లో బీఆర్ఎస్ పై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.
గ్రామస్థాయి కార్యకర్తలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని సూచించారని నాయకులు తెలిపారు. పార్టీలో చిత్తశుద్ధితో పనిచేసే వారికి స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కొనసాగిన పిప్పెర కృష్ణను కేటీఆర్ అభినందించి రాబోయే ఎన్నికల్లో చురుగ్గా పనిచేసి నియోజకవర్గంలో బీఆర్ఎస్ జండాను ఎగరవేయాలని పార్టీ నాయకత్వం ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో కుభీర్, బాసర, కుంటాల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎన్నిలా అనిల్, కోర్వ శ్యామ్, పడకంటి దత్తు తదితరులు ఉన్నారు.