హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): మాదిగలకు ఒక రాజ్యసభ సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ నేతలు బుధవారం గాంధీభవన్‌ను ముట్టడించారు. గాంధీభవన్ గేటు ముందు ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఇంజం వెంకట్‌స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మా దిగలకు రాజ్యసభ సీటు ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యసభ స్థానాల్లో మాదిగలకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ను మందకృష్ణ మాదిగ కోరారు. బుధవారం రాహుల్‌గాంధీకి లేఖ రాశారు.