హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన పెట్రోలియం, సహజవాయువు స్థాయీ సంఘం చైర్మన్ సునీల్ దత్తాత్రే తర్కరే ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి వద్దిరాజు హాజరయ్యారు. పెట్రోలియం రంగంలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. రవిచంద్ర మాట్లాడుతూ.. పెట్రో ఆధారిత వాహనాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగడంతో వాతావర ణం కలుషితమై, పర్యావరణం దెబ్బతింటున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
భావితరాలకు సమతుల్యమై న పర్యావరణం అందించాల్సిన అ వసరం ఉన్నదని చె ప్పారు. సమావేశం లో పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యులతోపాటు మహారాష్ట్ర పరిశ్రమలు, పర్యావరణ, వాతావరణ మార్పులు, పారిశ్రామిక అభివృద్ధి సంస్థ, పీసీబీ ఉన్నతాధికారులు, చమురు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వరంగంలోని చమురు సంస్థలు అమలుచేస్తున్న మానవవనరుల విధానాలను సమీక్షించారు. ఎంపీ వద్దిరాజు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.