హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడం బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లను తరలించేందుకు చంద్రబాబు చెప్పినట్టు రేవంత్‌రెడ్డి నడుచుకుంటున్నారని పేర్కొన్నారు.
సీబీఐ విచారణ పేరుతో కేసీఆర్, హరీశ్‌రావులను ముట్టుకుంటే తెలంగాణ ప్రజలు సహించబోరని, ఇందుకు కాంగ్రెస్, బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన అమెరికా నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇది కేసీఆర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర మాత్రమే కాదని, తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించి, కాళేశ్వరాన్ని ఎండబెట్టే కుయుక్తుల్లో భాగంగానే చూడాలని రవిచంద్ర పేరొన్నారు.