MP Etela Rajender | రాష్ట్ర చరిత్రలో దిగజారుడు భాష మాట్లాడిన సీఎం ఆయన ఒక్కడే
రాష్ట్ర చరిత్రలో అత్యంత దిగజారుడు భాష మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడేనని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.
హైదరాబాద్ : రాష్ట్ర చరిత్రలో అత్యంత దిగజారుడు భాష మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడేనని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. గత కొద్ది రోజులుగా ప్రతిపక్షాలను అందునా బీఆర్ఎస్ లక్ష్యంగా బూతు పురాణం అందుకుంటున్న సీఎం తీరుపై ఆయన స్పందించారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద నీళ్లు 94 మీటర్లు లేకున్నా కేవలం రూ.2 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మించి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. అది వదిలేసి సలహాలు ఇస్తున్న ఇంజినీర్లను తిట్టడం, బీఆర్ఎస్ నాయకుల రక్తం చిందిస్తా అనడం మూర్ఖత్వమన్నారు.
రేవంత్ రెడ్డి నాకు ఎన్డీఎస్ఏ చెప్తేనే ప్రాజెక్టుల్లో నీళ్లు నింపుతా అని అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పిల్లర్లు ఎక్కడా కుంగిపోలేదని, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు గ్రౌటింగ్ కూడా చేశారన్నారు. ఎల్ నినో ప్రభావం ఉన్నందున అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నీళ్ళు నింపుతామని రేవంత్ రెడ్డి ఎన్డీఎస్ఏ దగ్గరికి వెళ్ళి అడిగాడా? అని నిలదీశారు. ఇప్పటికైనా భేషజాలకు పోకుండా కాళేశ్వరం జలాలతో ప్రాజెక్టులను నింపి రైతులను ఆదుకోవాలని హితవు పలికారు.
ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత దిగజారుడు భాష మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడే
కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద నీళ్లు 94 మీటర్లు లేకున్నా కేవలం రూ.2 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మించి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు
అది వదిలేసి సలహాలు ఇస్తున్న ఇంజనీర్లను తిట్టడం, రక్తం చిందిస్తా అనడం మూర్ఖత్వం… https://t.co/8HVJzvnaNr pic.twitter.com/dGbZIGc47T
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

