డబ్ల్యూహెచ్వో నిపుణురాలు లూయిస్
లండన్, మే 30: మంకీపాక్స్ మరో మహమ్మారికి దారితీస్తుందని తాను అనుకోవడం లేదని డబ్ల్యూహెచ్ఓకి చెందిన నిపుణురాలు రోసముంద్ లూయిస్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది అనే ప్రశ్నతో పాటు మంకీపాక్స్ గురించి తెలియని అంశాలు ఇంకా చాలా ఉన్నాయని పేర్కొన్నారు.
సోమవారం జరిగిన ఓ పబ్లిక్ సెషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ డజన్ల సంఖ్యలో దేశాల్లో వెలుగుచూస్తున్న కేసుల్లో మెజార్టీ స్వలింగ సంపర్కులు, బైసెక్సువల్ వాళ్లలోనే వస్తున్నాయని చెప్పడం కష్టమని, దీనిపై శాస్త్రవేత్తలు మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. లైంగిక ధోరణితో సంబంధం లేకుండా ఎవరికైనా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నదని హెచ్చరించారు.