Godavarikhani | గోదావరిఖని: రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్)లో ఉద్యోగాలకు ఇస్తామన్న దళారుల విషయంలో బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువుల కర్మాగారం ఉద్యోగ బాధితుల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. దళారులను జైలు కు పంపించి బాధితులకు డబ్బులు ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల డబ్బులతో గోదావరి ఓడ్డుకు 18 ఎకరాల భూమి తీసుకుంటే దానికి సంబంధించి లే-అవుట్ పర్మిషన్లు కూడా ఎమ్మెల్యే ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితులకు ఇవ్వాల్సిన డబ్బులను పక్కనపెట్టి పర్మిషన్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగాలు వస్తాయని కొందరు బాధితులు భూములు స్థలాలు కుటుంబ సభ్యుల నగలు అమ్మి దళారులకు ముట్ట చెప్పారని గుర్తు చేశారు. దళారులు ఇంకా ఇవ్వాల్సిన డబ్బులను చెల్లించకపోతే వచ్చే మా ప్రభుత్వం వారికి న్యాయం చేస్తామని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆ 18 ఎకరాలను 100 నాగళ్లతో దున్నించి బాధితులకు పరిహారం ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. అంతే కాకుండా బాధితులతో డిల్లీకి వెళ్లి కేంద్ర పెట్రోలియం శాఖ అధికారులను కలుస్తామన్నారు.
ఇంకా వినకపోతే గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట టెంట్ వేసి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జహిద్ పాషా, కో ఆప్షన్ మెంబర్ తస్లీమా భాను, పోలాడి శ్రీనివాస రావు, మాజీ కార్పొరేటర్లు అయిత శివకుమార్, రవి నాయక్, బొబ్బిలి సతీష్, యువజన విభాగ అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, మాజీ కౌన్సిలర్ కృష్ణ స్వామి, నడిపల్లి సాయి, టీజీబీకేఎస్ కార్మిక నాయకులు రోడ్డ సంపత్, సురేందర్, అడ్డగట్ల గోపి, రాజ్ కుమార్, కళాధర్ రెడ్డి, అబ్దుల్ రెహ్మాన్, తెలంగాణ ఉద్యమకారులు పర్ష స్వాతి, మేకల రామస్వామి, బోట్ల పోషం, రంగు దుర్గా ప్రసాద్, అల్లి గణేష్, ఓజ్జ కొమరయ్య, కడమండ్ల శ్రీధర్, అన్వర్, చొప్పరి శ్రీనివాస్, సార్ల ఉదయ్, నరేష్, ఠాగూర్, రమేష్, నరేష్, జక్కుల ప్రేమ్ కుమార్, బొడ్డు మహేందర్, కొండా సురేష్, పోయిల రవి, దువాసి కార్తీక్, నార్మల రమేష్, ఎలకపల్లి అంజన్న, ఎస్కే షరీఫ్, సుమతి, జయ, పుష్ప తదితరులు పాల్గొన్నారు.