GT vs CSK : అహ్మదాబాద్‌లో సీఎస్కే ఆల్‌రౌండర్లు డారిల్ మిచెల్(63) విధ్వంసానికి తెరపడింది. అర్ధ సెంచరీతో జోరుమీదున్న మిచెల్‌ను మోహిత్ శర్మ వెనక్కి పంపాడు. దాంతో, 119 వద్ద సీఎస్కే నాలుగో వికెట్ పడింది. శివం దూబే క్రీజులోకి వచ్చాడు.
10 పరుగులకే మూడు వికెట్లు పడిన చెన్నైని మిచెల్, మోయిన్ అలీ(50)లు ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ధనాధన్ ఆడి చెన్నైని పోటీలోకి తెచ్చారు. నాలుగో వికెట్‌కు 109 రన్స్ జోడించారు. 13 ఓవర్లకు స్కోర్.. ఇంకా చెన్నై విజయానికి 107 పరుగులు కావాలి.