e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home News 'మోదీ పాపులర్‌ వ్యక్తే కావచ్చు.. కానీ బెంగాల్‌లో దీదీ తర్వాతనే' ‌

‘మోదీ పాపులర్‌ వ్యక్తే కావచ్చు.. కానీ బెంగాల్‌లో దీదీ తర్వాతనే’ ‌

'మోదీ పాపులర్‌ వ్యక్తే కావచ్చు.. కానీ బెంగాల్‌లో దీదీ తర్వాతనే' ‌

కోల్‌కతా : ప్రధాని నరేంద్ర మోదీ బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తే కావచ్చు కానీ, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం దీదీ తర్వాతనే ఉంటారని ప్రముఖ పోల్‌ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు మమతా, మోదీల మధ్య పోరాటం అని అన్నారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ డబుల్‌ డిజిట్‌ సీట్లు సాధించడం అసాధ్యమన్నారు. ఒకవేళ గనుక వారికి డబుల్‌ డిజిట్ దాటితే.. ఇకపై రాజకీయాలకు స్వస్థిపలుకుతా అని ప్రశాంత్‌ కిషోర్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గుచూపిన ఇక్కడి ఎస్సీ ఓటర్లు.. ఈసారి మాత్రం టీఎంసీకే ఓటేస్తారని ఘంటాపథంగా చెప్పారు.

గత దశాబ్దం కాలంగా అనేక రాజకీయ పార్టీల ప్రచారాలకు కేంద్రంగా ప్రశాంత్‌ కిషోర్‌ నిలిచారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ, తమిళనాడులో డీఎంకె చీఫ్ ఎంకే స్టాలిన్ కోసం పనిచేస్తున్నారు. ఈ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు స్ట్రాటజీలను రచించి అమలుచేయిస్తున్నారు. గతంలో విజయవంతమైన ఫలితాలను అందిపుచ్చుకుని భారత రాజకీయాల్లో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

కులాన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ ప్లాన్

‘ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవి. ఎందుకంటే గత 30-35 సంవత్సరాల కాలంలో బెంగాల్‌లో అధికార పార్టీని జాతీయ పాలక పార్టీ సవాలు చేయలేదు. వామపక్ష పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాలక కాంగ్రెస్ వారిని ఎప్పుడూ సవాలు చేయలేదు. ప్రాంతీయ పాలక పార్టీని జాతీయ పాలక పార్టీ సవాలు చేయడాన్ని బెంగాల్‌లో ఉండటం ఇదే మొదటిసారి. ఇంతకుముందు చూసినదానికంటే చాలా ఎక్కువగా కులాన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ కోరుకుంటున్నది. కులం ఎప్పుడూ ఉనికిలో లేదని చెప్పలేం. కానీ, ఇక్కడ కాస్తా భిన్నంగా ఉంటుంది’ అని ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పారు.

డబుల్‌ డిజిట్‌కే పరిమితం అవుతారు..

రెండు ప్రాంతీయ పార్టీలు తలపడుతున్నందునే తమిళనాడు కన్నా.. ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీలు తలపడుతున్న బెంగాల్‌పైనే ప్రజలు ఎక్కువ దృష్టి పెట్టారు. గత ఏడాది నవంబర్-డిసెంబరులో బీజేపీ చుట్టూ చాలా హైప్ ఏర్పడింది. వారు 200 సీట్లు సాధిస్తారని హైప్‌ తీసుకొచ్చారు. డిసెంబర్‌లో బీజేపీ 200 సీట్లు గెలుచుకునే స్థితిలో ఉన్నది. అయితే ఇప్పుడు అంచనాలు మారాయి. ఇప్పుడు వారు మూడంకెల సంఖ్య దాటేలా లేరు. రెండంకెలకే పరిమితం అవుతారని మాత్రం చెప్పగలను’ అని పేర్కొన్నారు.

ఎస్సీలకు బీజేపీపై నమ్మకం పోయింది..

పశ్చిమ బెంగాల్లో ఎస్సీల తర్వాత అతిపెద్ద సమాజంగా నమశూద్రులు, మాటువాస్ ఉన్నారు. వీరు గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సామూహికంగా ఓటు వేశారు. అయితే, ఆ తర్వాత బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో నమశూద్ర ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా వారు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రశాంత్‌ కిషోర్‌ వెల్లడిస్తూ.. సీఏఏ కారణంగా వారు బీజేపీవైపు మొగ్గారని, ఇన్నిరోజులైనా సీఏఏ తీసుకురాకపోవడంతో ఎస్సీలకు బీజేపీపై నమ్మకం పోయిందని, వారు ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయరని చెప్పారు. అందుకే ఈసారి బీజేపీ బెంగాల్‌లో సీఏఏను ఎక్కువగా వినిపించడం లేదన్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోవద్దనే..

ప్రభుత్వం వ్యతిరేకత ఓటును సాధ్యమైనంతవరకు తగ్గించే ప్రయత్నం చేశామని తెలిపారు. ‘బ్లాక్ ప్రెసిడెంట్లలో దాదాపు 60 శాతం మంది ఇప్పుడు కొత్తవారని, అలాగే 80 మందికి పైగా ఎమ్మెల్యేలను తొలగించి కొత్త వారికి టిక్కెట్లు ఇచ్చామని, వీటి వల్ల ప్రభుత్వంపై వ్యతిరేక ఓటును తగ్గించడానికి దోహదపడ్డాయని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ అభిమాని అవుతారని అనడం లేదు. అయితే ఇది ప్రభుత్వంపై ఉన్న కొంత కోపాన్ని తగ్గించడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది’ అని ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పారు.

ఇవి కూడా చదవండి..

తేళ్లతో హోలీ కేళీ.. ఈ గ్రామం స్పెషల్‌..!

భారత్‌లో త్వరలో మూడో వ్యాక్సిన్‌కు ఆమోదం : డాక్టర్ రెడ్డీస్‌

వ్యాక్సిన్‌ తీసుకున్న పుతిన్‌కు సైడ్‌ ఎఫెక్ట్స్‌

తేడాలు మరచి కలిసి సాగుదాం : కమలా హారిస్‌ హోలీ సందేశం

చైనాలో చిక్కుకున్న ‘ఎవర్‌ గివెన్‌’ ట్రాలీ.. నిలిచిన ట్రాఫిక్‌

అగ్రి చట్టాలను మంటల్లో వేసి రైతుల ‘హోలీ కా దహన్‌’

చైనాలో బయటపడిన టెర్రకోట ఆర్మీ.. చరిత్రలో ఈరోజు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
'మోదీ పాపులర్‌ వ్యక్తే కావచ్చు.. కానీ బెంగాల్‌లో దీదీ తర్వాతనే' ‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement