MLC Palla Rajeshwar Reddy | పదో తరగతి ప్రశ్నపత్రం వాట్సాప్‌లో బయటకు రావడం వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందని బయటపడటంపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక విద్యార్థుల జీవితాలతో బీజేపీ నేతలు చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
పదో తరగతి ప్రశ్నపత్రాన్ని బండి సంజయ్ డైరెక్షన్లోనే బీజేపీ కార్యకర్త ప్రశాంత్ లీక్ చేశారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీ అనుబంధ సంఘాలు కుట్రపూరితంగా పేపర్ లీక్ చేశాయని ఆరోపించారు. బండి సంజయ్‌పై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.