జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్సీ ఎల్ రమణ (Ramana) శనివారం అందజేశారు. వివిధ కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొంది వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి (CM Relief Fund) కోసం జగిత్యాల నియోజకవర్గంలోని తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి మంజూరైన లక్షా యాభైవేల రూపాయల చెక్కులను ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ లబ్ధిదారులకు ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.
కార్యక్రమంలో జగిత్యాల పట్టణ కౌన్సిలర్లు కోరుకంటి రాము, తోట హరీశ్, మాజీ జడ్పీటీసీ కొలుముల రమణ, రాయికల్ మండలం ప్రధాన కార్యదర్శి కొండపల్కల రత్నాకర్ రావు, వొళ్లాల గంగాధర్, గంగిపెల్లి వేణుమాధవ్, పెండెం గంగాధర్, చిరంజీవి, నందు నాయక్ పాల్గొన్నారు.