
Allipoola Vennela | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన అల్లిపూల వెన్నెల బతుకమ్మ పాట ( bathukamma song ) వచ్చేసింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ( ar rahman ) స్వరాలు అందించగా.. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ( gautam vasudev menon ) దర్శకత్వం వహించిన అల్లిపూల వెన్నెల బతుకమ్మ పాటను ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లోని తన నివాసంలో మంగళవారం విడుదల చేశారు. బతుకమ్మ ఆట, పాటను తెలంగాణ ఆత్మగౌరవ పతాకంగా లోకానికి పరిచయం చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పాటను నిర్మించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ పూల సింగిడిని ఇవాళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌తో కలిసి ఆవిష్కరించారు.
ఉత్తరా ఉన్నికృష్ణన్ ( uthara unnikrishnan ) పాడిన అల్లిపూల వెన్నెల బతుకమ్మ పాటను ప్రముఖ రచయిత మిట్టపల్లి సురేందర్ ( mittapalli surender ) సాహిత్యం అందించారు. జాతీయ అవార్డు గ్రహీత బ్రిందా కొరియోగ్రఫీ చేశారు. అక్టోబర్ 6 నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా ఘనంగా జరగనుంది. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే ఈ పండుగకు అల్లిపూల వెన్నెల పాట మరింత శోభను తీసుకువస్తున్నది. పాట చిత్రీకరణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు. అల్లిపూల వెన్నెల బతుకమ్మ పాటను విడుదల చేసిన అనంతరం సందర్భంగా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేస్తూ.. బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఆ ట్వీట్‌ను ఎమ్మెల్సీ కవిత రీట్వీట్ చేశారు.
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!
— A.R.Rahman (@arrahman) October 5, 2021
A festival of life.
A celebration of togetherness.
Bringing you a glimpse of the beauty of Bathukamma
through "#AllipoolaVennela" along with Telangana Jagruthihttps://t.co/rJarGvmwGs
The festival of colours, melody and togetherness Bathukamma is here! Here’s sharing a glimpse of the special song for Bathukamma by @arrahman @menongautham and a dream team for all my sisters.https://t.co/8zjWgwHUFy#AllipoolaVennela #BathukammaSong @TJagruthi https://t.co/7QioZ7DfT1
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 5, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
bathukamma | బతుకమ్మ ఉత్సవాలు అమావాస్య రోజే ఎందుకు మొదలవుతాయి?
శరన్నవరాత్రుల పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
TTD | ఈ నెల 7న బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
Gold price: పెరుగుతూనే ఉన్న బంగారం, వెండి ధరలు
Tags | Allipoola Vennela | Kavitha Kalvakuntla | Mekha Rajan | Anagha | Angelina | AR Rahman | Gautham Vasudev Menon | Uthara Unnikrishnan | అల్లిపూల వెన్నెల | మేక రాజన్ | ఏఆర్ రెహమాన్ | కల్వకుంట్ల కవిత | తెలంగాణ జాగృతి | గౌతమ్ వాసుదేవ్ మీనన్ | ఉత్తర ఉన్నికృష్ణన్ |