IPL 2026 : పంతొమ్మిదో సీజన్లో పలు జట్లను గాయాలు వెంటాడుతున్నాయి. ఆరంభానికి ముందే కొందరు ఆటగాళ్లు టోర్నీకి దూరమవ్వగా.. తాజాగా మరో ఇద్దరూ ఐపీఎల్ నుంచి నిష్క్రమించారు. రెండో విజయంతో ఊపిరిపీల్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ ఖలీల్ అహ్మద్(Khaleel Ahmed) సేవల్ని కోల్పోనుంది. మరోవైపు గాయంతో బాధ పడుతున్న ముంబై ఇండియన్స్ పేసర్ అథర్వ అంకొలేకర్ సైతం వైదొలిగాడు. ఈ కుర్రాడి స్థానంలో దేశవాళీ క్రికెట్లో మెరుస్తున్న 21 ఏళ్ల క్రిష్ భగత్(Krish Bhagat)ను ముంబై తీసుకుంది.
ప్రతి సీజన్లో ఫేవరెట్లైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి నిరాశ పరుస్తున్నాయి. ప్రధాన ఆటగాళ్ల వైఫల్యం.. పేసర్ల గాయాలు ఈ రెండు జట్లను ఇబ్బంది పెడుతున్నాయి. సొంతగడ్డపై రెండు విజయాలతో ప్లే ఆఫ్స్ ఆశలు నిలబెట్టుకున్న సీఎస్కేకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే పేసర్ నాథన్ ఎల్లిస్ సేవల్ని కోల్పోయిన చెన్నైకి.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆడకపోవడం ఇబ్బందిగా మారింది.
OFFICIAL ANNOUNCEMENT
Khaleel Ahmed has been ruled out of IPL 2026 after sustaining a right quadricep injury in the game against KKR.
Wishing Khaleel a speedy recovery.#WhistlePodu pic.twitter.com/PFQz3iSWRq
— Chennai Super Kings (@ChennaiIPL) April 16, 2026
పైగా ఇప్పుడు సీనియర్ పేసర్ ఖలీల్ అహ్మద్ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. తొడ కండరాల గాయంతో బాధ పడుతున్న ఖలీల్ ఐపీఎల్‌కు దూరమయ్యాడని సీఈవో కాశీ విశ్వనాథన్ క్రిక్‌బజ్‌తో వెల్లడించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేయలేకపోయిన ఖలీల్.. సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో ఎవరిని తీసుకోవాలి? అనేది ఇంకా సీఎస్కే ఖరారు చేయలేదు.
ముంబై ఇండియన్స్ సైతం తమ స్క్వాడ్‌లో మార్పులు చేసింది. గాయంతో బాధ పడుతున్న యువ స్పీన్నర్ అథర్వ అంకొలేకర్ స్థానంలో పంజాబీ కుర్రాడు, పేసరైన క్రిష్ భగత్‌ను తీసుకుంది. పంజాబ్ తరఫున 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 9 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడిన భగత్ గత రెండు సీజన్లుగా ముంబై నెట్ బౌలర్‌గా కొనసాగాడు. ఇప్పుడు అనుకోకుండా ముంబై స్క్వాడ్‌లోకి వచ్చేశాడు. అథర్వకు ఎలాంటి గాయం అయింది? అనే విషయం మాత్రం ఫ్రాంచైజీ వెల్లడించలేదు.
📰 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 𝐈𝐧𝐝𝐢𝐚𝐧𝐬 𝐬𝐢𝐠𝐧 𝐊𝐫𝐢𝐬𝐡 𝐁𝐡𝐚𝐠𝐚𝐭 𝐚𝐬 𝐚 𝐫𝐞𝐩𝐥𝐚𝐜𝐞𝐦𝐞𝐧𝐭 𝐩𝐥𝐚𝐲𝐞𝐫 💙
Mumbai Indians have named Krish Bhagat as a replacement for Atharva Ankolekar, who has been ruled out of IPL 2026.
Read more 👉 https://t.co/rsMBu1p0aO… pic.twitter.com/xi4GLZqpcz
— Mumbai Indians (@mipaltan) April 16, 2026