PCC Chief | రేవంత్ రెడ్డి మాటల్ని సీరియస్‌గా తీసుకోవద్దు.. సురేఖ పదవికి ఢోకా లేదు..!
PCC Chief : కాంగ్రెస్‌లో వర్గపోరు, వచ్చే ఎన్నికల్లో పోటీపై చెలరేగుతున్న వివాదాలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు.
PCC Chief : కాంగ్రెస్‌లో వర్గపోరు, వచ్చే ఎన్నికల్లో పోటీపై చెలరేగుతున్న వివాదాలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన పరకాల అసెంబ్లీ టికెట్(Parakala Assembly Ticket)పై మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రేవంత్ చెప్పినంత మాత్రాన సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వరు కదా అని మహేశ్ కుమార్ పేర్కొన్నారు.
పరకాల టికెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి మాటే ఫైనల్ కాదని, అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మంత్రి కొండా సురేఖ పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె పదవి సేఫ్ అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రివర్గంలో బీసీలకు సరైన వాటా దక్కలేదని పేర్కొన్న ఆయన.. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు. ‘తెలంగాణలో మంత్రి పదవుల కేటాయింపులో బీసీలకు తగిన న్యాయం జరగలేదని రాహుల్ గాంధీకి చెప్పాను. అలాంటప్పుడు సురేఖను మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగిస్తాం?’ అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. అంతేకాదు తాము ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు వంద శాతం అమలు కావడం లేదని అంగీకరించారు పీసీసీ అధ్యక్షుడు.
ఉమ్మడి వరంగల్ పర్యటనలో భాగంగా పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మరోసారి రేవూరి ప్రకాశ్ రెడ్డికే టికెట్ ఖాయమని అన్నారు. దాంతో.. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత 2028లో నేనే పరకాల ఎమ్మెల్యే అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్‌పై.. కొండా సురేఖపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు కూడా. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్.. అదేం లేదని చెప్పడం గమనార్హం.
బ్రేకింగ్ న్యూస్
కొండా సురేఖ మంత్రి పదవి సేఫ్
బీసీలకు తెలంగాణ మంత్రివర్గంలో సరైన వాటా దక్కలేదు
తెలంగాణలో మంత్రి పదవుల కేటాయింపులో బీసీలకు తగిన న్యాయం జరగలేదని రాహుల్ గాంధీకి చెప్పాను
అలాంటప్పుడు సురేఖ మంత్రి పదవి ఎందుకు తొలగిస్తాము
– టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్… pic.twitter.com/kAhrDIGjEC
— Telugu Scribe (@TeluguScribe) August 29, 2026
రేవంత్ రెడ్డి మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు
అతను చెప్పినంత మాత్రాన టికెట్ రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇవ్వరు కదా
– టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Credits: Tv9 https://t.co/yQcmW2rN8R pic.twitter.com/8WwrpSFOcA
— Telugu Scribe (@TeluguScribe) August 29, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

