ENG vs PAK : లార్డ్స్ టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. మూడో రోజు ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలనుకున్న ఇంగ్లండ్ (England) ఇన్నింగ్స్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. అప్పటికే ఏడు వికెట్లు తీసిన పాకిస్థాన్ బౌలర్లను విసిగిస్తూ డాన్ లారెన్స్(50 నాటౌట్) అర్ధ శతకంతో మెరిశాడు. ఆట నిలిపివేసే సరికి ఇంగ్లండ్ 357 పరుగుల ఆధిక్యంలో ఉంది.
స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు వర్షం అడ్డుపడింది. లార్డ్స్ స్టేడియంలో మూడో రోజు తడబడుతూ సాగుతున్న జో రూట్ సేనకు వరుణుడు ఉపశనమిచ్చాడు. మొహమ్మద్ అబ్బాస్(3-48), ఖుర్రం(2-56), మొహమ్మద్ అలీ(2-54)ల ధాటికి టాపార్డర్ తడబడినా హ్యారీ బ్రూక్(34) పోరాడాడు.
Rain stops play again just 14 balls into the evening session 😫 #ENGvPAK https://t.co/8dQ13ff1J0
— Cricinfo (@cricinfo) August 29, 2026
అనంతరం డాన్ లారెన్స్(50 నాటౌట్)లు అర్ధ శతకంతో అదుకున్నాడు. అయితే..46.5వ ఓవర్ సమయంలో వాన అందుకుంది. దాంతో, అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికీ ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 117 రన్స్ చేసిన ఆతిథ్య జట్టు 357 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 110కే ఆలౌటైన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ పేసర్లు ఓలీ రాబిన్సన్(4-11), జోఫ్రా ఆర్చర్(3-26)లు నిప్పులు చెరగడంతో రెండో రోజు పాక్ ఆటగాళ్లు క్రీజులో నిలవలేకపోయారు. ఓపెనర్ అజాన్ అవైస్(46)కు సహకరించే వాళ్లు కరువయ్యారు. చివరి బ్యాటర్ అబ్బాస్(3)ను ఆర్చర్ ఔట్ చేయడంతో 110 పరుగులకే ఆ జట్టు ఆలౌటైంది.