Narayanpet : నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ చిన్నారి వైద్యం అందక ప్రాణాలు విడిచింది. డాక్టర్లు చికిత్స చేయకపోవడంతో ఏడేళ్ల చైత్ర మరణించింది. కొల్లంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి జ్వరంతో బాధపడుతున్న తన కూతురును ఉదయం 4 గంటలకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. సకాలంలో స్పందించాల్సిన వైద్యులు.. ఆ పాపకు చికిత్స చేయలేదు. దాంతో.. ఓ తల్లికి కడుపుకోత మిగిలింది.
కొల్లంపల్లి గ్రామానికి చెందిన కమ్మరి వెంకటరాములు అనే వ్యక్తి కూతరు చైత్రకు తీవ్ర జ్వరం వచ్చింది. దాంతో, ఆయన తన బిడ్డను శనివారం ఉదయం 4 గంటలకు నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తన కూతురికి వెంటనే వైద్యం చేయాలని ఆయన డాక్టర్లను ప్రాధేయపడ్డారు. దాదాపు 5 గంటలు వైద్యం కోసం వేచి ఉన్నా.. వైద్యులు స్పందించకలేదు. జ్వరం తీవ్రతకు ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలోనే చైత్ర మృతిచెందింది. కళ్లముందే కన్నబిడ్డ ప్రాణాలు కోల్పోవడాన్ని వెంకటరాములు కుటుంబం తట్టుకోలేకపోయింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.
సమయానికి వైద్యం అందక ఏడేళ్ల చిన్నారి మృతి
నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం
నారాయణపేట జిల్లా కొల్లంపల్లి గ్రామంలో జ్వరంతో బాధపడుతున్న తన కూతురు చైత్ర(7)ను ఉదయం 4 గంటలకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన కమ్మరి వెంకటరాములు అనే వ్యక్తి
5 గంటలు వైద్యం కోసం వేచి… pic.twitter.com/erdU2pjkPD
— Telugu Scribe (@TeluguScribe) August 29, 2026