Watch: ఎఫ్‌డీఏ అధికారిని చుట్టుముట్టిన జనం.. గడువు ముగిసిన బిస్కెట్లు తినాలని బలవంతం
Food Body Officer Cornered | గడువు ముగిసిన స్నాక్ మిక్స్ తిన్న రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)కు ఫిర్యాదు చేయడంతో ఆ అధికారి అక్కడకు చేరుకున్నారు. జనం ఆయనను చుట్టుముట్టారు. గడువు ముగిసిన బిస్కెట్లను తినాలని బలవంతం చేశారు.
ముంబై: గడువు ముగిసిన స్నాక్ మిక్స్ తిన్న రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)కు ఫిర్యాదు చేయడంతో ఆ అధికారి అక్కడకు చేరుకున్నారు. జనం ఆయనను చుట్టుముట్టారు. గడువు ముగిసిన బిస్కెట్లను తినాలని బలవంతం చేశారు. (Food Body Officer Cornered) ఆ అధికారి లంచం తీసుకుని షాపు వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఈ సంఘటన జరగింది. ఒక షాపులో స్నాక్ మిక్స్ కొనుగోలు చేసి తిన్న తర్వాత రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కాగా, ఆ షాపులో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఎఫ్‌డీఏ కార్యాలయాన్ని సంప్రదించి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ షాపును తనిఖీ చేసేందుకు ఒక ఎఫ్‌డీఏ అధికారి అక్కడకు చేరుకున్నారు. ఆ దకాణంలో గడువు ముగిసిన బిస్కెట్ ప్యాకెట్లను అమ్ముతున్నట్లు తనిఖీలో ఆయన గుర్తించారు. గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
అయితే తనిఖీ ప్రారంభానికి ముందే చిన్నారి అస్వస్థతకు కారణమైన గడువు ముగిసిన స్నాక్ మిక్స్ ప్యాకెట్లను ఆ షాపు నుంచి తొలగించినట్లు స్థానికులు ఆరోపించారు. అలాగే గడువు ముగిసిన బిస్కెట్ల ప్యాకెట్లను గుర్తించినప్పటికీ ఆ దుకాణదారుడిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంపై వారు ఆగ్రహించారు. ఆ అధికారి లంచం తీసుకుని ఈ విషయాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఎఫ్‌డీఏ అధికారిని జనం చుట్టుముట్టారు. గడువు ముసిగిన ఆ బిస్కెట్లు సురక్షితమైతే ఆయన తినాలని సవాల్ చేశారు. గడువు ముగిసిన బిస్కెట్లను ఆ అధికారి నోటిలో బలవంతంగా పెట్టేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A Food and Drug Administration (FDA) officer was reportedly confronted by an angry crowd during an inspection of a paan shop in Maharashtra’s Chhatrapati Sambhajinagar after locals alleged that the shop was selling expired food products.
A video of the confrontation circulating… pic.twitter.com/5B3RtCD5Bp
— Hate Detector 🔍 (@HateDetectors) August 29, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

