Terrorists : పంజాబ్ పోలీసులు (Pujab Police) తాజాగా ఉగ్ర కుట్రను భగ్నంచేశారు. పాకిస్థాన్ (Pakistan) నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) తో సంబంధాలున్న ఒక నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి నాలుగు గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అమృత్ సర్, మొహాలీలో స్టేట్ స్పెషల్ సెల్‌తో కలిసి కౌంటర్ వింగ్ ఆఫ్ పంజాబ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ను నిర్వహించారు.
నిందితుడి వద్ద నుంచి నాలుగు గ్రనేడ్లతోపాటు రెండు విదేశీ తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పాకిస్థాన్ హ్యాండ్లర్లతో సంబంధం ఉన్న నిందితుడు వారి ఆదేశాల మేరకు ఉగ్రకుట్రకు ప్రణాళిక రచిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఇటీవల చంఢీగడ్‌లో జరిగిన గ్రనేడ్ దాడికి, ఈ నిందితుడికి సంబంధం ఉన్నట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. అమృత్‌సర్‌లోని స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్లో కేసు నమోదైంది. నిందితుడికి ఇంకా ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయా? అని గుర్తించేందుకు తదుపరి విచారణ చేపట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు.