హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపై సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి అమిత్ షాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బిడ్డలకు కేంద్రం ఏమిచ్చిందో బెబుతారా అంటూ వివిధ అంశాలపై ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.3 వేల కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని నిలదీశారు. వెనుకబడి ప్రాంతాల అభివృద్ధి గ్రాంటు రూ.1350 కోట్లు, జీఎస్టీ పరిహారం రూ.2247 కోట్ల జీఎస్టీ పరిహారం సంగతేమిటని కవిత ప్రశ్నించారు. గత ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఒక్క ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐడీ, మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించాలని కవిత డిమాండ్ చేశారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పాలని కోరారు. కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించడం కేంద్రప్రభుత్వం కపటత్వం కాదా? అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. అంతేకాదు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెరిగిన నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై, భారత్‌ను అత్యంత ఖరీదైన ఇంధనం, ఎల్పీజీని విక్రయించడంలో అగ్రగామి దేశంగా మార్చడంపై, ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బనంపై మీ సమాధానం ఏమిటని కేంద్ర మంత్రి అమిత్ షాను ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
Amit Shah ji , Isn't it the sheer hypocrisy of the Union Govt. to accord the National project status to Upper Bhadra project in Karnataka, Ken Betwa river linking project & denying the same for Palamuru Rangareddy Lift Irrigation Scheme & #KaleshwaramProject of Telangana? 5/5
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 14, 2022