Sarpanch Elections | రెండో విడత తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 151 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా.. 90 స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఇక 23 స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు.
నారాయణపేట నియోజకవర్గం మరికల్ మండలంలోని ఇబ్రహీంపట్నం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి నాగరాణి విజయం సాధించగా.. పాలకుర్తి నియోజకవర్గం తొర్రుర్ మండలంలోని భోజ్య తండాలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి 17 ఓట్లతో గెలుపొందారు. ఎల్లారెడ్డి నియోజవర్గం లింగంపేట్ మండలంలోని మాలపాటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి జుకంటి అశ్విని రాజు 19 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం పాపయ్య పల్లె పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చెన్నవేని పర్శరాములు గెలుపొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వెన్నమనేని లావణ్య రమణారావు విజయం సాధించారు.
– నాగర్‌కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వెంకటాపూర్ (కొట్టలగడ్డ) సర్పంచ్‌గా నర్సింహరెడ్డి గెలుపు
– నాగర్‌కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం బోయాపూర్ సర్పంచ్‌గా దాసర్ల ప్రణీత శ్రీకాంత్ విజయం
– తిమ్మాజిపేట మండలం హేమ్లానాయక్ తండాలో కృష్ణ విజయం
– దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట మండలం రాజోలి గ్రామ సర్పంచ్‌గా మన్యంకొండ అరుణ 61 ఓట్ల మెజారిటీతో గెలుపు
– దేవరకద్ర మండల పరిధిలోని వీరనాయక్ తండాలో లక్ష్మీనాయక్ 69 ఓట్ల మెజారిటీతో విజయం
– మిడ్జిల్ మండలం మంగలిగడ్డ తండా సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి రాజు నాయక్ గెలుపు
– మిడ్జిల్ మండలం చౌతకుంట తండా సర్పంచ్‌గా కే.శ్రీలత గెలుపు
– మిడ్జిల్ మండలం బైరంపల్లి సర్పంచ్‌గా బి.గోపాల్ ముదిరాజ్ విజయం
– పెంట్లవెల్లి మండలం తడకలపల్లివారి తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి పరశురాముడు విజయం
– రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పాపయ్యపల్లె సర్పంచ్‌గా చెన్నవేని పర్శరాములు విజయం
– రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లాపూర్ సర్పంచ్‌గా వెన్నమనేని లావణ్య రమణారావు గెలుపు
– రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం బోటిమీదపల్లి సర్పంచ్‌గా గౌరవేని శ్రీవాణి గెలుపు
– రాజన్న సిరిసిల్ల జిల్లా తాళ్లపల్లె సర్పంచ్‌గా మీసాల కనకరాజు విజయం
– రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చింతలఠాణా సర్పంచ్‌గా గుర్రం అనసూర్య విజయం
– రంగపేట సర్పంచ్‌గా మేడిపల్లి భాస్కర్ రెడ్డి విజయం
– బోయినపల్లి మండలం కొత్తపేట సర్పంచ్‌గా ఇల్లందుల రాజేశం గెలుపు
– ఆరేపల్లి గ్రామ సర్పంచ్‌గా మరిచా మోహన్‌రావు గెలుపు
– బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామ సర్పంచ్‌గా చింతలపల్లి కవిత వెంకటరెడ్డి గెలుపు
– రాళ్లపేట గ్రామ సర్పంచ్‌గా బాలుసారి పరశురాములు విజయం