Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
ఎడాపెడా కరెంటు కోతలు సృష్టిస్తూ రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు.
హత్నుర,అక్టోబర్ 11 : ఎడాపెడా కరెంటు కోతలు సృష్టిస్తూ రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం భీమ్లా తండా, దేవుని గుట్ట తండా శివారులో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతుండటాన్ని పరిశీలించి రైతుల బాధలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నుండి రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేక దాటవేసే దోరని అవలం బిస్తుందని మండిపడ్డారు. రైతులు సాగుచేసిన పంట పొలాలు కరెంటు కోతలు, లో వోల్టేజీతో ఎండిపోతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కరెంటు కోసం రైతన్నలు రోడ్డు ఎక్కుతున్నప్పటికీ చీమకుట్టినట్టు కూడా ప్రభుత్వానికి కావడం లేదని ఆరోపించారు. కండ్ల ముందు పంటలు ఎండిపోతుంటే ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర ప్రజలు నేడు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విత్తనాలు కొనుగోలు నుండి మందుల వరకు యాప్‌ల పేరుతో ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం నేడు చేతికి వచ్చిన పంటను పండించుకుంటున్న తరుణంలో కరెంటు కోతలు సృష్టిస్తూ రైతులను అప్పుల ఊబిలోకి నెట్టుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు అనే నానుడిని మరొకసారి ప్రభుత్వం నిరూపించుకుందని గుర్తు చేశారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతూ రైతులు సాగు చేస్తున్న పంటలు ఎండిపోతున్నాయని ఇచ్చే కరెంటును సక్రమంగా ఇచ్చి పంటలు కాపాడాలని కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

