జగిత్యాల : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్( Mla Sanjay kumar ) వెల్లడించారు. పట్టణంలో మైనార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ముస్లిం(Muslims) మైనార్టీ ల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని వివరించారు. మసీదులు(Masid), షాదీఖానా(Shadikhana), శ్మశానవాటికల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తుందని వివరించారు.
జగిత్యాల నియోజకవర్గంలో 12 వేల మంది ఆడబిడ్డలకు షాదీ ముబారక్(Shadimubarak), కల్మాణ లక్ష్మి చెక్కులు అందజేశామన్నారు. రాష్ట్రంలో 204 మైనార్టీ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, సౌకర్యాలు అందిస్తుందని వెల్లడించారు.జిల్లాలో 5 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీ ఉండగా 3200 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య సౌకర్యాలను పొందుతున్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఒక్కో విద్యార్థి పై రూ. లక్షకు పైగా నిధులు ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు.
విదేశ విద్య కోసం రూ. 20 లక్షల స్కాలర్ షిప్ అందిస్తున్నామని అన్నారు.గతంలో మైనార్టీలను ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే వాడుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ చేతల ప్రభుత్వమని మాటల ప్రభుత్వం కాదని అన్నారు. రంజాన్ సందర్భంగా దుస్తులు, ఇప్తార్లను ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం కోత పెడుతుందని ఇంకా లక్ష కోట్లు రావాల్సి ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్,రియాజ్ మామ,రియాజ్ ఖాన్, అమీన్ ఉల్ హాసన్, నాసిరొద్దీన్ అక్తర్, హసీబొద్దీన్, మొయినుద్దీన్ అఫ్సర్, అసిఫ్, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.