MLA Sanjay Kalvakuntla | బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం మేరకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చేలా పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు.
కాగా ఇవాళ కోరుట్ల మండలంలోని యూసుఫ్ నగర్ గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సంజయ్ గోడలపై వాల్ రైటింగ్ ప్రచారాన్ని స్వయంగా రాశారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు. ఈ సభను పార్టీ అభిమానులు, నాయకులు, కార్తకర్తలు విజయవంతం చేయాలని కోరారు. కోరుట్ల నియోజకవర్గం నుండి పదివేల మందితో సభకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
Shadnagar | రెండు గంటలైనా రాని 108 అంబులెన్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Kunal Kamra | కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట
KTR | ఏడాది పాటు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేస్తాం : కేటీఆర్