Sabitha Indra Reddy | మా చీరలు లాగి, గొంతులు పట్టమని సీఎం రేవంత్ రెడ్డి మీకు ఆదేశం ఇచ్చాడా..? అని పోలీసులు దురుసు ప్రవర్తనపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. మహళా ఎమ్మెల్యేలు అని చూడా కుండా జుట్టు పట్టి, చీరలాగి అమానవీయంగా ప్రర్తించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా నేతల పట్ల పోలీసులు అలా ప్రవర్తిస్తే రేవంత్ రెడ్డికి ఆనందంగా ఉందా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నల్ల రంగు టీ షర్ట్ వేసుకొని, దాని మీద మోడీ-అదానీ ఫోటో పెట్టుకొని పార్లమెంట్ దగ్గర ప్రశ్నించొచ్చు అంట. కానీ ఇక్కడ మేము నల్ల రంగు దుస్తులు వేసుకొని అసెంబ్లీకి వెళ్లొద్దు అనడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీకి మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెళ్లం.. ప్రజల తరపున మాట్లాడడానికి, హామీలపై ప్రశ్నించడానికి వెళ్తామన్నారు. కానీ ఈరోజు అసెంబ్లీ లోపలికి కూడా వెళ్లనివ్వకుండా పోలీసులతో మమ్మల్ని అడ్డుకున్నారు.
తెలంగాణ, ఉమ్మడి ఆంధ్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా మహిళా శాసన సభ్యుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చూడలేదన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి మా మహిళా శాసన సభ్యులను పట్టుకొని కామెంట్స్ చేశాడు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా 4 రోజులు మేము సమావేశాల్లో నిల్చోనే ఉంటే స్పీకర్ కనీసం కూర్చోమని అనలేదు, ముఖ్యమంత్రి నవ్వుతూ వెళ్లిపోయాడు. ఇదీ కాంగ్రెస్ ప్రజా పాలన అని మండిపడ్డారు.
మా చీరలు లాగి, గొంతులు పట్టమని రేవంత్ రెడ్డి ఆదేశం ఇచ్చాడా?
పోలీసులు అలా ప్రవర్తిస్తే రేవంత్ రెడ్డికి ఆనందంగా ఉందా?
రాహుల్ గాంధీ నల్ల రంగు టీ షర్ట్ వేసుకొని, దాని మీద మోడీ-అదానీ ఫోటో పెట్టుకొని పార్లమెంట్ దగ్గర ప్రశ్నించొచ్చు అంట
కానీ ఇక్కడ మేము నల్ల రంగు దుస్తులు వేసుకొని… https://t.co/p1rO7GRfYV pic.twitter.com/GSF8PcTp0E
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026