MLC Tata Madhu | నేను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలను అవమానించలేదని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. నా కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. నేను దురుసుగా మాట్లాడింది నిజమే. కానీ మా మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై మాత్రమే ఆగ్రహం వ్యక్తం చేశానని మధు స్పష్టం చేశారు.
నేను పోలీసులతో మాట్లాడిన మాటలను వక్రీకరించి, స్పీకర్, చైర్మన్లను అవమానించినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద చర్చించడం చేతకాక ఇలాటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు.