శంకర్పల్లి, ఏప్రిల్ 13 : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల కుటుంబాలను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఎల్వర్తి గ్రామ మాజీ సర్పంచ్ జి పాండురంగారెడ్డి ఇటీవల మరణించారు. ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకున్నారు.
అలాగే మహరాజ్‌పేట్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ దోసాడ నర్సింహారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల మరణించిన ఆయన కుమారుడు ప్రవీణ్‌రెడ్డి వివరాలను అడిగి తెలుసుకొని, వారికి మనోధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గండిచెర్ల గోవర్ధన్‌రెడ్డి, నాయకులు కమల్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి, కందాడ నర్సింహారెడ్డి, అంతిరెడ్డి, కుమార్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.