స్టేషన్ ఘన్పూర్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రానికి చెందిన వ్యక్తి సీఎలో ఆల్ ఇండియా టెస్టులో గోల్డ్ మెడల్ సాధించిన పరకాల మణిశంకరును ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభినందించారు. బుధవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నిరుపేద కుటుంబానికి చెందిన పరగాల శ్రీనివాస్, సుకుమారి దంపతుల కుమారుడు పరకాల మణిశంకర్ చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తూ ఇటీవల జరిగిన ఇన్సూరెన్స్ రిస్క్ మేనేజ్మెంట్లో నిర్వహించిన ఆల్ ఇండియా టెస్ట్ లో మొదటి స్థానంలో నిలిచాడు.
ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐసిఏఐ అధ్యక్షుడు సీఎ రంజిత్ కుమార్ అగర్వాల్, ఐసిఎఐ ఉపాధ్యక్షులు సిఎ చరణ్ జోత్ సింగ్ నందా చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి మణిశంకర్ తో పాటు అతని తండ్రి పరకాల శ్రీనివాసును శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, జిల్లా నాయకులు సీహెచ్ నరేందర్ రెడ్డి, బెలీడర్ వెంకన్న, పోగుల సారంగపాణి, అంబటి కిషన్ రాజు, కొలిపాక సతీష్, జీడీ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Bride Gives Birth To Baby | పెళ్లైన రెండు రోజులకే బిడ్డకు జన్మనిచ్చిన నవ వధువు.. వరుడు షాక్
Kadiyam Srihari | కడియం రాజీనామా చేసి నిజాయితి నిరూపించుకోవాలి