Bride Gives Birth To Baby | పెళ్లైన రెండు రోజులకే బిడ్డకు జన్మనిచ్చిన నవ వధువు.. వరుడు షాక్
Bride Gives Birth To Baby | పెళ్లి జరిగిన రెండు రోజులకే నవ వధువు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వరుడు, అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ప్రసవించిన బిడ్డకు తండ్రి ఎవరో ఆమె చెప్పాలని డిమాండ్ చేశారు.
లక్నో: పెళ్లి జరిగిన రెండు రోజులకే నవ వధువు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. (Bride Gives Birth To Baby) దీంతో వరుడు, అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ప్రసవించిన బిడ్డకు తండ్రి ఎవరో ఆమె చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 24న ఒక జంటకు చాలా గ్రాండ్‌గా పెళ్లి జరిగింది. మరునాడు నవ వధువు అత్తవారింటికి వెళ్లింది.
కాగా, ఫిబ్రవరి 26న ఉదయం నవ వరుడి కుటుంబ సభ్యులకు టీ కూడా నవ వధువు ఇచ్చింది. అయితే ఆ సాయంత్రం కడుపులో తీవ్ర నొప్పితో ఆమె బాధపడింది. వరుడు, అతడి కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళకు పురిటి నొప్పులు వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పెళ్లైన రెండు రోజులకే నవ వధువు బిడ్డను ప్రసవించడంపై వరుడు, అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ మహిళను భార్యగా స్వీకరించేందుకు వరుడు నిరాకరించాడు.
మరోవైపు పెళ్లి సమయంలో వధువు పెద్ద లెహంగా ధరించిందని దీంతో ఆమె కడుపుతో ఉన్నట్లుగా తమకు అనుమానం రాలేదని వరుడి సోదరి తెలిపింది. శోభనం రోజున కొత్త జంట విడిగా ఉన్నారని ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలో వధువు జన్మనిచ్చిన బిడ్డకు తండ్రి ఎవరో ఆమె చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Marriage on 24th
No touch on first night on 25th
She delivers a baby on the 26thMen being conned into marriages like this has no data or statistic in India. This is absolutely criminalpic.twitter.com/pak52I5EWJ
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) March 3, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- baby
- bride
- Gives Birth
- groom
RELATED ARTICLES
తాజా వార్తలు
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

