ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి భోజమ్మ(98) సోమవారం మృతి చెందారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం కన్నుమూశారు. భోజమ్మ మృతి పట్ల మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.