రామంతాపూర్,సెప్టెంబర్ 26 : రామంతాపూర్ చిన్న చెరువును శుక్రవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్నతో కలిసి సందర్శించారు. తీవ్రమైన వర్షాలకు చెరువు నిండి వర్షపునీరు ఇళ్లలోకి, మార్కండేయ దేవాలయాంలోకి వస్తుందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. చెరువులో పూడికతీత పనులు చేపడితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. చెరువు సుందరీకరణ పనులు వెంటనే చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు.
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెరువు అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. సుందరీకరణ పనులు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ సర్వబాబు యాదవ్, సూరంశంకర్, చాంద్‌పాషా, ఆలె రమేశ్, మనీశ్, ప్రశాంత్, బోసాని పవన్‌కుమార్, శ్రీను, టోని, వంశీ పద్మశాలి సంఘం అధ్యక్షులు కృష్ణ, ఆలె రమేశ్, విజయ్‌ప్రకాశ్, వేణు, శేఖర్, యాదగిరి, వెంకటయ్య, సత్యనారాయణ, పెంటయ్య,మురళి తదితరులు పాల్గొన్నారు.