మంత్రి కోమటిరెడ్డీ.. మా కడుపు కొట్టొద్దు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అన్యా యం జరిగితే ఊరుకునేదిలేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హెచ్చరించారు.
- మీరు నా రాజకీయ గురువు
- మీ కోసం తల నరుక్కుంట
- అలా అని నీటి దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకోలేను
- ఉద్ధండాపూర్కు 16 టీఎంసీలకు చుక్క నీరు తగ్గినా బరాబర్ కొట్లాడుతం
- కోమటిరెడ్డికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హెచ్చరిక
జడ్చర్ల, అక్టోబర్ 17 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అన్యా యం జరిగితే ఊరుకునేదిలేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘నా రాజకీయ గురువు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోసం తలనైనా నరుక్కుం టా.. కానీ మా కడుపు కొడుతానంటే తలవంచను’ అని స్పష్టంచేశారు. పీఆర్ఎల్ఐ పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించడాన్ని తాము అంగీకరించబోమని తేల్చిచెప్పారు.
డిండి ప్రాజెక్టు కు 30 టీఎంసీల నీటిని తరలిస్తే ఉద్ధండాపూర్ రిజర్వాయర్‌కు నీళ్లు తగ్గే అవకాశం ఉన్నదని అన్నారు. ఉద్ధండాపూర్కు 16 టీఎంసీలకు చుక్కనీరు తగ్గినా సహించేది లేదని హెచ్చరించారు. డిండికి గ్రావిటీ ద్వారా నీటిని తరలించుకుపోతే పైన ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు రావ ని, అందుకోసం పాలమూరు ప్రాజెక్టు పూర్తిచేసి ఉద్ధండాపూర్, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుల నుంచి గ్రావిటీ ద్వారా రైట్ కెనాల్ ద్వారా వెళ్లే నీటితో రంగారెడ్డి, మునుగోడు, నల్లగొండకు నీటిని ఇవ్వాలని సూచించారు. లేదంటే ఎస్ఎల్బీసీ ద్వారా కూడా ఇవ్వవచ్చని తెలిపారు.
అదీగాక నాగార్జునసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి ఎత్తిపోసి నల్లగొండ, మునుగోడుకు నీటిని తరలించవచ్చని చెప్పారు. ఇక్కడి నుంచి అయితే తక్కువ దూరంతోనే నీటిని తరలించే అవకాశం ఉన్నదని సూచించారు. అలాకాకుండా డిండి ద్వారానే నీటిని తరలిస్తే రైతుల భూములతోపాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని రెండు గ్రామాలు కనుమరుగయ్యే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకోసం ఏదుల నుంచి డిండి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను విరమించుకోవాలని సూచించారు. దసరా తర్వాత ఉద్ధండాపూర్ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

