ట్రెండీ లుక్ మీదే!
పండుగంటేనే కొత్త దుస్తుల జోరు. ఇక వేడుకలప్పుడు మగువల సింగారింపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తమను సెంటర్ ఆప్ అట్రాక్షన్‌గా నిలుపుకొనేందుకు మ్యాచింగ్ దుస్తులు, కొత్త కొత్త డిజైన్లను ధరిస్తుంటారు. మరీ ఈ దసరా, దీపావళి వేడుకలకు ఏ డిజైన్‌లో మీరు మెరిసిపోతారో? ఏ దుస్తులు ధరిస్తే అందమైన లుక్కొస్తుందో.. వాటి గురించి ఓ లుక్కేద్దాం రండి..
పండుగంటేనే కొత్త దుస్తుల జోరు. ఇక వేడుకలప్పుడు మగువల సింగారింపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తమను సెంటర్ ఆప్ అట్రాక్షన్‌గా నిలుపుకొనేందుకు మ్యాచింగ్ దుస్తులు, కొత్త కొత్త డిజైన్లను ధరిస్తుంటారు. మరీ ఈ దసరా, దీపావళి వేడుకలకు ఏ డిజైన్‌లో మీరు మెరిసిపోతారో? ఏ దుస్తులు ధరిస్తే అందమైన లుక్కొస్తుందో.. వాటి గురించి ఓ లుక్కేద్దాం రండి..
చనియా చోలీ: నవరాత్రి వేడుకల్లో, దాండియా ఆడే సమయంలో ధరించడానికి చనియా చోలీ మంచి ఎంపిక. మిర్రర్ వర్క్ ఉన్న రంగురంగుల లెహంగా, హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధరిస్తే మీ లుక్ అదురిపోతుంది.
కాంచీపురం పట్టు: దసరా రోజు పూజ సమయంలో కాంచీపురం పట్టుచీర ధరిస్తే మీ రూపం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. బ్రైట్ రెడ్, రాయల్ బ్లూ, ఎల్లో కలర్ పట్టు చీర ధరించి టెంపుల్ జ్యూవెలరీ జత చేస్తే అందంగా కనిపిస్తారు.
అనార్కలీ సూట్: ఫ్లోర్ లెంగ్త్ అనార్కలీ కుర్తీని ధరించడంతో మీకు పండుగ వైబ్ వస్తుంది. ప్లెయిన్ లేదా తక్కువ వర్క్ ఉన్న అనార్కలీతో గుజరాతీ వర్క్ ఉన్న దుపట్టా ధరిస్తే గ్రాండ్ లుక్ వస్తుంది.
ఆర్గాంజా చీర: ఫ్లోరల్ ప్రింట్ ఉన్న ఆర్గాంజా చీర కట్టుకుంటే మీ లుక్ మరింత ట్రెండీగా కనిపిస్తుంది. చీరకు సెట్ అయ్యే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధరించి, వడ్డానం పెట్టుకుంటే
మీ లుక్ సూపర్.
ప్లాజో విత్ క్రాప్ టాప్: ప్లాజో, క్రాప్‌టాప్ కాంబినేషన్ సూపర్‌గా ఉంటుంది. వీటిని ధరించి దాండియా ఆడటం ఈజీగా ఉంటుంది.
బెనారసి కాటన్: పండగల సీజన్లో బెనారసి కాటన్ టిష్యూ పట్టు చీర ధరించడం వల్ల మీ లుక్ మరింత ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. ఈ చీరకు సరైన జ్యూవెలరీ పెట్టుకుంటే.. అందరి కండ్లూ మీపైనే ఉంటాయి.
పోచంపల్లి ఇక్కత్: పోచంపల్లి ఇక్కత్ చీరతో పాటు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ధరించడం వల్ల మీకు ఫెస్టివ్ లుక్ వస్తుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

