ఒక్కే సిపువ్వేసి సందమామ! ఆరోగ్యానికి రక్ష సందమామ!
బతుకమ్మ.. తెలంగాణలో అతిపెద్ద పండుగ! పూలనే దేవుడిగా కొలిచే వేడుక! మనిషికి-ప్రకృతికి మధ్య ఉన్న అవినాభావ బంధానికి ప్రతీక. అంతేకాదు.. మన ఆరోగ్యానికి రక్ష కూడా! ప్రకృతిలో దొరికే రకరకాల పూలతో బతుకమ్మను పేరుస్తాం. ఈ పూలన్నీ పూజకు మాత్రమే పరిమితం కాదు. ఎన్నో అద్భుతమైన ఆరోగ్య, ఔషధ గుణాలతో నిండి ఉంటాయి.
బతుకమ్మ.. తెలంగాణలో అతిపెద్ద పండుగ! పూలనే దేవుడిగా కొలిచే వేడుక! మనిషికి-ప్రకృతికి మధ్య ఉన్న అవినాభావ బంధానికి ప్రతీక. అంతేకాదు.. మన ఆరోగ్యానికి రక్ష కూడా! ప్రకృతిలో దొరికే రకరకాల పూలతో బతుకమ్మను పేరుస్తాం. ఈ పూలన్నీ పూజకు మాత్రమే పరిమితం కాదు. ఎన్నో అద్భుతమైన ఆరోగ్య, ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. వర్షాకాలం ముగిసే సమయంలో మన చుట్టూ ఉండే వాతావరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ‘బతుకమ్మ’గా ఈ పూలన్నిటినీ వాగుల్లో నిమజ్జనం చేయడం ద్వారా.. నీటిని శుద్ధి చేస్తాయి. తాగునీటి ద్వారా వచ్చే వ్యాధులను నివారిస్తాయి.
తంగేడు: బతుకమ్మలోనే కాదు.. ఆయుర్వేదంలోనూ తంగేడు పువ్వులది ప్రత్యేక స్థానం. తంగేడు ఆకులు, పూలు మధుమేహాన్ని నియంత్రించడంలో, కాలేయ పనితీరును మెరుగుపరచడంలో సాయపడతాయి. ఈ పూల వాసన పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ శుభ్రపడి, ఉబ్బసం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గునుగు: శరీరంలో ఇన్ఫ్లమేషన్, నొప్పులను తగ్గించే యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు.. గునుగు పూలలో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. వర్షాకాలంలో వచ్చే గజ్జి, తామర, ఇన్ఫెక్షన్లు, వివిధ రకాల చర్మ సమస్యలను తగ్గించడంలో గునుగు ఆకులు సమర్థంగా పనిచేస్తాయి. చర్మంపై అలర్జీలకు దీని ఆకుల రసాన్ని రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఆయుర్వేద వైద్యంలోనూ మూత్రపిండాల సమస్యలను తగ్గించడంలో గునుగు మొక్కను వాడతారు.
సీతమ్మ జడ పూలు: ఈ మొక్కలో ఉండే కొన్ని ప్రత్యేకమైన పాలీశాకరైడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సాయపడతాయి. శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తినిస్తాయి. ఈ పూలు, విత్తనాలలో ఉండే ఔషధ గుణాలు.. మధుమేహం, రక్తపోటును అదుపులో ఉంచుతాయి. గుండె, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ ముందుంటాయి.
బంతి పూలు: సహజంగానే బంతి పూల వాసన సమర్థమైన క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. ఈ మొక్కల చుట్టుపక్కల ఉండే గాలిలోని హానికారక సూక్ష్మజీవులను, దోమలను తరిమికొడతాయి. గాయాలు త్వరగా మానడానికి ఆయుర్వేదంలో భాగంగా బంతిపూల రసాన్ని ఉపయోగిస్తారు.
చామంతి పూలు: ఈ పూల సువాసన మెదడును ప్రశాంతపరుస్తుంది. కడుపులో మంట, అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో చామంతి పూల రసం అద్భుతంగా పనిచేస్తుంది. పేగుల పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, సితోపాటు పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి, కణాల నష్టాన్ని నివారిస్తాయి. చామంతి పూలలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మంపై వచ్చే మంట, దద్దుర్లు, మొటిమలు, అలెర్జీలను తగ్గించడంలోనూ ముందుంటాయి.
గుమ్మడి, బీర పూలు: యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే గుమ్మడి, బీర పూలు.. శరీరంలోని వేడిని తగ్గించి, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

