చెడుపై విజయం సాధించండి
రావణుడి పది తలలను కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, భయం, సిగ్గు, జాడ్యం, అహంకారాలకు ప్రతీకలుగా భావిస్తారు. మనిషిలో ఉండే ఈ దుర్గుణాలన్నిటినీ వదిలేయాలనే సందేశంతో.. విజయ దశమి రోజున ‘రావణ దహనం’ నిర్వహిస్తారు. అయితే, ఈ ఆధునిక యుగంలోని మనుషులు కొన్ని చిన్నచిన్న చెడు అలవాట్లకు బానిసలయ్యారు. జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలంటే.. వాటిని వదిలిపెట్టాల్సిందేనని మానసిక నిపుణులు చెబుతున్నారు. దసరా అంటేనే.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. కాబట్టి, చెడు అలవాట్లను వదిలిపెట్టి, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడానికి అదే సరైన సమయం!
రావణుడి పది తలలను కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, భయం, సిగ్గు, జాడ్యం, అహంకారాలకు ప్రతీకలుగా భావిస్తారు. మనిషిలో ఉండే ఈ దుర్గుణాలన్నిటినీ వదిలేయాలనే సందేశంతో.. విజయ దశమి రోజున ‘రావణ దహనం’ నిర్వహిస్తారు. అయితే, ఈ ఆధునిక యుగంలోని మనుషులు కొన్ని చిన్నచిన్న చెడు అలవాట్లకు బానిసలయ్యారు. జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలంటే.. వాటిని వదిలిపెట్టాల్సిందేనని మానసిక నిపుణులు చెబుతున్నారు. దసరా అంటేనే.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. కాబట్టి, చెడు అలవాట్లను వదిలిపెట్టి, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడానికి అదే సరైన సమయం!
- ఒత్తిడి, ఆందోళన , డిప్రెషన్ను దూరం చేయడానికి మీ మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి. ఎందుకంటే, మానసిక సమస్యలే ఎక్కువగా దీర్ఘకాలిక శారీరక సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి మీ భావోద్వేగాలను అర్థం చేసుకుని, ప్రతికూల భావాలను సరిదిద్దుకోడానికి ప్రయత్నించండి.
- ఇంటిని-ఆఫీసును సమన్వయం చేసుకోండి. ఆఫీస్ పని వేళలు ముగిసిన తర్వాత.. మీ కుటుంబం, ప్రియమైనవారితో నాణ్యమైన సమయాన్ని గడపడం ముఖ్యం. ఎప్పుడూ పని గురించే కాకుండా.. సినిమాలు చూడటం, స్నేహితులతో మాట్లాడటం, పుస్తకం చదవడం వంటి వ్యాపకాలతో రిలాక్స్ అవ్వండి.
- మనసకు నచ్చే వ్యాపకాలు.. జీవితంలో గొప్ప మార్పును తెస్తాయి. ఒత్తిడిని తగ్గించడంతోపాటు మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఫొటోగ్రఫీ, పెయింటింగ్, డ్యాన్సింగ్, సింగింగ్, సంగీతం, వంట చేయడం.. ఇలా కనీసం ఒకటి కన్నా ఎక్కువ హాబీలను క్రమం తప్పకుండా కొనసాగించండి.
- కుటుంబంతో గడిపే సమయం.. మీ బంధాలను బలపరుస్తుంది. ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను దూరం చేస్తుంది. కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయడం, ముచ్చటించుకోవడం చేయండి.
- పండుగ అంటేనే.. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, మీ ఆర్థిక విషయాలను చక్కదిద్దుకోవాలని, ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఆదా చేయాలని తీర్మానం చేసుకోండి. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం, క్రెడిట్ కార్డులకు బదులుగా నగదును ఉపయోగించడం ద్వారా ఖర్చులను అదుపులో ఉంచుకోండి.
- మానసిక, శారీరక ఆరోగ్యానికి సానుకూల దృక్పథం అనేది చాలా కీలకం. మనసులో ప్రతికూల ఆలోచనలు వస్తున్నప్పుడల్లా.. వాటిని సానుకూలంగా మార్చుకోండి. సానుకూల వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడండి, కృతజ్ఞతా భావాన్ని అలవర్చుకోండి. చిన్నచిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కోండి.
- సోషల్ మీడియాలో నిరంతరం స్క్రోల్ చేసే అలవాటు ఉన్నట్లయితే.. వెంటనే గ్యాడ్జెట్ల వాడకాన్ని తగ్గించుకోవాలని తీర్మానం చేసుకోండి. స్మార్ట్ఫోన్లు, గ్యాడ్జెట్ల వ్యసనం.. మానసిక, శారీరక ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కంటి చూపును దెబ్బతీయడమే కాకుండా.. ఊబకాయం, గుండె జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలకూ దారితీస్తుంది.
- రోజుకో కొత్తరోగం పంజా విసురుతున్న ప్రస్తుత తరుణంలో.. ఆరోగ్య బీమా అనేది అత్యంత అవసరం. ఏదైనా మంచి బీమా ప్లాన్ను ఎంచుకోండి. అత్యవసర సమయాల్లో ఆర్థిక భారాన్ని తగ్గించుకోండి. ముఖ్యంగా వృద్ధులైన తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య బీమా తీసుకోవడం ముఖ్యమని గుర్తించుకోండి.
- శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎలాంటి షార్ట్కట్లు ఉండవు. అందుకే, శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలనీ, ఫిట్నెస్ లక్ష్యాలను సాధించాలనీ తీర్మానం చేసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, హైడ్రేటెడ్గా ఉండటం, నిద్ర వేళలను పాటించడం, ప్రతిరోజూ కొంత శారీరక శ్రమ చేయడం లాంటివి అలవాటు చేసుకోండి.
- సిగరెట్ కాల్చే అలవాటు ఉన్నట్లయితే.. ఈ పండుగ నుంచే పూర్తిగా మానేయడానికి ప్రయత్నించండి. ధూమపానం ఊపిరితిత్తులనే కాదు.. గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఆరోగ్యం కావాలంటే.. ధూమపానాన్ని దూరం పెట్టడం ఎంతో ముఖ్యం.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

