ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దిగ్గజ సంగీత దర్శకుడు దేవా (75) శనివారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు.
‘తేనిసై తెంద్రల్’ గా అభిమానులు పిలుచుకునే ఆయన నాలుగు దశాబ్దాల పాటు సాగించిన స్వర ప్రయాణంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటల్ని అందించారు. వినసొంపైన మెలోడీలతో పాటు హుషారెత్తించే మాస్ పాటలతో సంగీతప్రియుల్ని అలరించారు. దేవా అసలు పేరు దేవనేశన్ చొక్కలింగం.
1950 నవంబర్ 20న చెన్నైలో జన్మించారు. 1986లో వచ్చిన ‘మాట్టుకర’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సుదీర్ఘ కెరీర్లో 400లకు పైగా చిత్రాలకు సంగీతాన్నందించారు. 1990 దశకం దేవా సంగీత ప్రస్థానంలో స్వర్గయుగంగా నిలిచింది. రజనీకాంత్ నటించిన అన్నామలై, బాషా, అరుణాచలం చిత్రాల్లోని పాటలు మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. వీటితో పాటు ఆసై, కాదల్ కోైట్టె (తెలుగులో ‘ప్రేమలేఖ’) నేరుక్కు నేర్, నినైత్తేన్, వందాయ్, వాలి, ఖుషి చిత్రాల్లోని పాటలు విశేష ప్రజాదరణ పొందాయి.
తెలుగులో మ్యూజికల్ హిట్స్
‘శ్రీమాన్ బ్రహ్మచారి’ చిత్రం ద్వారా తెలుగులోకి అరంగేట్రం చేసిన ఆయన చిరంజీవి ‘మాస్టర్’, పవన్కల్యాణ్ ‘తొలిప్రేమ’, నాగార్జున ‘ఆటోడ్రైవర్’తో పాటు బాగున్నారా, నాగ, విజయదశమి వంటి చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్నారు. చెన్నై వీధుల్లో పుట్టిన గానా సంగీతాన్ని వెండితెరపై తీసుకొచ్చి సామాన్య ప్రేక్షకులకు చేరువ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. స్థానిక యాస, సహజమైన పదాలను తన సంగీతంలో మేళవించి గానా పాటలకు కొత్త ఊపునిచ్చారు. సినీ సంగీతానికి ఆయన అందించిన సేవలకు గాను తమిళనాడు రాష్ట్ర చలన చిత్ర పురస్కారంతో పాటు 1992లో ‘కలైమామణి’ అవార్డు అందుకున్నారు. దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా సైతం సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

