రామవరం, ఆగస్టు 11 : సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం ఆదేశానుసారం సింగరేణి సంస్థలోని ఉద్యోగులందరూ తాము పనిచేసే ప్రాంతాల్లో మిషనరీ వినియోగాన్ని పెంచాలని, కార్మికులు కూడా తమ పని గంటలు పెంచుకోవాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శాలెం రాజు అన్నారు. సోమవారం కొత్తగూడెం ఏరియాలోని అధికారులు, యూనియన్ ప్రతినిధులతో మల్టీ డిపార్ట్మెంట్ టీమ్ నిర్వహణ, దాని ఆవశ్యకతపై కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీఎం షాలెం రాజు మాట్లాడుతూ.. నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తూ వినియోగుదారులకు అందించేందుకుగాను ప్రతి ఒక్కరు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. కొత్తగూడెం ఏరియాకు మల్టీ డిపార్ట్మెంట్ టీమ్ మీటింగ్ ఈ నెల 12, 14, 16, 18న ఏర్పాటు చేయడమైందన్నారు.
డిజిఎం(ఐఈడి) ఎన్.యోహాన్ మల్టీ డిపార్ట్మెంట్ టీమ్ సమావేశం ఉద్దేశం అనగా సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత, మిషనరీ పనితనం, ఉత్పత్తి వ్యయం, ఉద్యోగుల సంక్షేమ కోసం సింగరేణి సంస్థ తీసుకుంటున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జే.గట్టయ్య, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, ఎస్.ఓ.టు జిఎం జి.వి. కోటిరెడ్డి, ఏరియా ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, ఏజీఎం (ఫైనాన్స్) కె.హనా సుమలత, ఏజీఎం (సివిల్) సీహెచ్. రామకృష్ణ, డీజీఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, ఏజెంట్ రామ్ భరోస్ మహాతో, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.రమేశ్, ఎన్.వి.ఆర్. ప్రహ్లాద్, ఎం.వి. నరసింహారావు, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Ramavaram : మిషనరీ వినియోగం, కార్మికుల పని గంటలు పెరగాలి : జీఎం షాలెం రాజు